రెడ్‌మీ నోట్‌ 10 వివరాలు తెలుసా?

బడ్జెట్ ఫోన్ అంటే సగటు భారతీయుడికి గుర్తొచ్చేది షావోమి బ్రాండ్. ఎంఐ, రెడ్‌మీ పేర్లతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తూ దేశవ్యాప్తంగా అమ్మకాల్లో దూసుకెళ్తోంది. తాజాగా రెడ్‌మీ బ్రాండ్‌లో... 

Updated : 12 Aug 2022 12:17 IST

ఇంటర్‌నెట్ డెస్క్‌: బడ్జెట్ ఫోన్ అంటే సగటు భారతీయుడికి గుర్తొచ్చేది షావోమి. ఎంఐ, రెడ్‌మీ పేర్లతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తూ దేశవ్యాప్తంగా అమ్మకాల్లో దూసుకెళ్తోంది. తాజాగా రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్‌ 10 కొత్త మోడల్‌ను మార్చి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెడ్‌మీ నోట్ 10, నోట్‌ 10 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ తీసుకొస్తున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ని రెడ్‌మీ మైక్రోసైట్‌ ద్వారా వెల్లడించింది. 

📱 నోట్‌ 10, నోట్ 10 ప్రో రెండింటిలో ఒక మోడల్‌లో 5జీ కనెక్టివిటీ ఫీచర్‌ ఉంటుంది. 

📱 గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్లలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దాంతోపాటు హై-రిజల్యూషన్ ఆడియో ఔట్‌పుట్‌ అందిస్తుంది. 

📱 వెనకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. ముందు పంచ్‌ హోల్ డిస్‌ప్లేతో సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 

📱 ఈ ఫోన్లకు ఐపీఎక్స్‌ 52 వాటర్‌, డస్ట్‌ ప్రొటెక్షన్‌ రేటింగ్ ఇచ్చారు. దీని వల్ల నీటిలో తడిచినా పాడవకుండా ఉంటాయట. దుమ్ము, ధూళి నుంచి కూడా రక్షణ ఉంటుంది. 

📱 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌సీడి డిస్‌ప్లే ఇస్తున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఇస్తున్నారట. ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నట్లు సమాచారం. 

📱  4 జీబీ ర్యామ్/64జీబీ మెమొరీ, 6 జీబీ ర్యామ్‌/64 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్‌ తీసుకొస్తున్నారు. అలాగే గ్రే, వైట్, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఎంఐ.కామ్‌, అమెజాన్‌ వెబ్‌సైట్ల నుంచి మొబైల్‌ను కొనుగోలు చెయ్యొచ్చు. ధర, ఇతర వివరాలు తెలియాలంటే మార్చి 4 వరకు వేచి చూడాల్సిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని