Windows 11: అప్‌డేట్‌కు ఏం కావాలో ఈ యాప్ చెప్పేస్తుంది!

తాజాగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌ 11 పేరుతో కొత్త ఓఎస్‌ను తీసుకొచ్చింది. గత ఓఎస్‌లకు భిన్నంగా..యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో విండోస్‌ 11ను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మీరు ఉపయోగించే సిస్టంలో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని షరతు విధించింది...

Published : 28 Jun 2021 23:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాజాగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌ 11 పేరుతో కొత్త ఓఎస్‌ను తీసుకొచ్చింది. గత ఓఎస్‌లకు భిన్నంగా.. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో విండోస్‌ 11ను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మీరు ఉపయోగించే సిస్టంలో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని షరతు విధించింది. ఇందుకోసం పీసీ హెల్త్ అనే యాప్‌ను విడుదల చేసింది. ఇది మీరు ఉపయోగిస్తున్న సిస్టంను పరీక్షించి విండోస్‌ 11 అప్‌డేట్ అవుతుందా లేదా అనేది యూజర్‌కి తెలియజేస్తుంది. అయితే విండోస్ 11 ఎందుకు అప్‌డేట్ కాదనే దానికి మాత్రం కచ్చితత్వంతో చెప్పపోవడంతో దీని పనీతీరుపై యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా గిట్‌హబ్‌ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ WhyNotWin11 అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఇది సిస్టంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఏయే విభాగాలు విండోస్‌ 11ని సపోర్ట్ చేస్తాయి? వేటిని అప్‌గ్రేడ్ చేయాలనేది సూచిస్తుంది. 

ఉదాహరణకు మీ సిస్టం 32-బిట్‌ సిస్టం అయితే దానిని రెడ్ మార్క్‌లో చూపిస్తుంది. ఎందుకంటే విండోస్‌ 11 అప్‌డేట్‌కు 64-బిట్‌ సిస్టం అవసరం. అలానే ర్యామ్‌, స్టోరేజీ, ప్రాసెసర్‌, బూట్ టైప్‌, టీపీఎం వెర్షన్, గ్రాఫిక్‌ కార్డ్‌ వంటి వాటిని కూడా పరిశీలించి విండోస్‌ 11ని సపోర్ట్ చేసే విభాగాలను గ్రీన్‌ కలర్‌లో, సపోర్ట్ చేయని వాటిని రెడ్‌ కలర్‌లో చూపిస్తుంది. WhyNotWin11 యాప్‌ని ఎవరైనా గిట్‌హబ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యూజర్స్ నుంచి వస్తున్న అభిప్రాయలను పరిగణనలోకి తీసుకున్న మైక్రోసాఫ్ట్‌ పీసీ హెల్త్‌ యాప్‌ను కూడా అప్‌డేట్ చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని