Apple App Store: 2021లో యాపిల్ అడ్డుకున్న మోసపూరిత లావాదేవీల విలువ ఎంతో తెలుసా?
యాపిల్ కంపెనీ 2021లో సుమారు 1.5 బిలియన్ డాలర్ల మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డకున్నట్లు తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇంటర్నెట్‌డెస్క్: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.. వారి డేటాకు భద్రత కల్పించడం టెక్ కంపెనీలకు సవాల్‌తో కూడుకున్న అంశం. యూజర్ డేటా లక్ష్యంగా జరిగే సైబర్ దాడులను ముందుగానే పసిగట్టి వాటిని అడ్డుకునే ప్రయత్నంలో చాలా వరకు టెక్ కంపెనీలు సఫలీకృతమవుతున్నాయి. యాపిల్ కంపెనీ 2021లో సుమారు 1.5 బిలియన్ డాలర్ల మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డుకున్నట్లు తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది.
యాప్‌ల ముసుగులో యూజర్ల ఆర్థికపరమైన లావాదేవీల వివరాలతోపాటు, వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న సుమారు 1.6 మిలియన్ల యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు యాపిల్ కంపెనీ వెల్లడించింది. అలానే మోసపూరిత కార్యకలాపాలతో సంబంధమున్న సుమారు 170 మిలియన్ల యూజర్ ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు, డేటా భద్రతకు, మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు, యాప్ స్టోర్‌ను అత్యుత్తమ సేవలు అందించే వేదికగా మార్చేందుకు తమ సైబర్ నిపుణులు నిరంతరం కృషి చేస్తుంటారని యాపిల్ స్పష్టచేసింది.
యాప్ రివ్యూ
యాప్ స్టోర్ నుంచి యూజర్లు డౌన్లోడ్ చేసుకునే యాప్‌లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి డెవలపర్స్‌కు నేరుగా తెలియజేసేందుకు మల్టీలేయర్ (కంప్యూటర్ ఆటోమేషన్, మానవ లిఖిత సమీక్ష) రివ్యూ ఇస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. ‘‘యాప్ రివ్యూ వల్ల యాప్‌లలోని భద్రతాపరమైన లోపాలు, పనితీరుకు సంబంధించి యూజర్లు అందించే సమాచారాన్ని డెవలపర్స్ నేరుగా తెలుసుకోవచ్చు. డెవలపర్స్ సదరు యాప్‌ను యాప్ స్టోర్ నిబంధనల ప్రకారం డిజైన్ చేశారా? లేదా? అనే దానిపై యాప్ రివ్యూ బృందం సమీక్ష నిర్వహిస్తుంది. మల్టీలేయర్ రివ్యూ ద్వారా 2021లో సుమారు పది లక్షల మంది కొత్త యాప్ డెవలపర్స్ తమ యాప్‌లలోని లోపాలను మెరుగుపరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూజర్ల నుంచి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్న సుమారు 3,43,000 యాప్‌లను రివ్యూ బృందం తిరస్కరించింది. యూజర్లు రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ ఫీచర్ ద్వారా తమకు అనుమానం కలిగిన యాప్‌పై ఫిర్యాదు చేస్తే.. దానిపై సమీక్ష నిర్వహించి సకాలంలో చర్యలు తీసుకుంటాం’’ అని యాపిల్ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
నకిలీ రివ్యూలు, రేటింగ్‌లు కలిగిన యాప్‌లపై కూడా చర్యలు తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. 2021లో సుమారు 94 మిలియన్ల నకిలీ రివ్యూలు, 170 మిలియన్ల నకిలీ రేటింగ్లను తొలగించినట్లు చెప్పింది. దానితోపాటు మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 8,02,000 డెవలపర్స్ ఖాతాలను తొలగించడంతో పాటు, 1,53,000 డెవలపర్ నమోదు ప్రక్రియలను తిరస్కరించినట్లు కంపెనీ పేర్కొంది.
యాపిల్ పే, స్టోర్కిట్ వంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే యాప్‌లలో యూజర్ డేటా హ్యాకర్స్ చేతికి చిక్కకుండా మెరుగైన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. అలానే యాపిల్ పే ద్వారా లావాదేవీలు జరిపే యూజర్లకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని వ్యాపార సంస్థలతో పంచుకోబోమని సంస్థ పేర్కొంది. సుమారు 9,05,000 యాప్స్ ఈ సాంకేతికత ద్వారా ఉత్పత్తులను విక్రయించడంతోపాటు, ఆర్థికపరమైన సేవలను అందిస్తున్నాయని తెలిపింది. యాప్ స్టోర్‌ను యూజర్లకు సురక్షితమైన, నమ్మకమైన, మోసపూరిత లావాదేవీలు, ఆర్థికపరమైన నేరాలు జరగకుండా అడ్డకునే వేదికగా మార్చేందుకు నిరంతం కృషి చేస్తామని యాపిల్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.