వాట్సప్‌లోనూ స్టార్‌

ఈమెయిల్‌లో స్టార్‌ గుర్తు గురించి తెలిసిందే. దీంతో ముఖ్యమైన మెయిళ్లను గుర్తు పెట్టుకోవచ్చు. ఇలా అవసరమైనప్పుడు వెంటనే చూసుకోవచ్చు. చాలామంది పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ వాట్సప్‌లోనూ ఇలాంటి ఫీచర్‌...

Updated : 29 Sep 2021 05:53 IST

మెయిల్‌లో స్టార్‌ గుర్తు గురించి తెలిసిందే. దీంతో ముఖ్యమైన మెయిళ్లను గుర్తు పెట్టుకోవచ్చు. ఇలా అవసరమైనప్పుడు వెంటనే చూసుకోవచ్చు. చాలామంది పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ వాట్సప్‌లోనూ ఇలాంటి ఫీచర్‌ అందుబాటులో ఉంది. అదే ‘స్టార్డ్‌ మెసేజెస్‌’. దీంతో మెసేజెస్‌ను బుక్‌మార్క్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా వెంటనే రిఫర్‌ చేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవడమెలా?

* వాట్సప్‌ ఛాట్‌ను ఓపెన్‌ చేసి, స్టార్‌ గుర్తు పెట్టుకోవాలనుకునే మెసేజ్‌ మీద కాసేపు అలాగే నొక్కి పట్టాలి. అప్పుడు తెర పైభాగాన స్టార్‌ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్‌ చేస్తే ముఖ్యమైన మెసేజ్‌గా సేవ్‌ అవుతుంది. ఇలాంటి మెసేజ్‌లన్నీ స్టార్డ్‌ మెసేజెస్‌ విభాగంలో కనిపిస్తాయి. వీటిని చూడాలనుకుంటే వాట్సప్‌ను ఓపెన్‌ చేసి.. పైన కుడివైపున కనిపించే నిలువు మూడు చుక్కలను ట్యాప్‌ చేయాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూలో ‘స్టార్డ్‌ మెసేజెస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా స్టార్‌ గుర్తు కలిగిన మెసేజ్‌లన్నింటినీ చూడొచ్చు. ఒకవేళ స్టార్‌ గుర్తును తీసేయాలనుకుంటే దాని మీద కాసేపు అలాగే నొక్కి పట్టి, పైన కనిపించే స్టార్‌ గుర్తును తీసేస్తే సరి. కావాలనుకుంటే అన్ని స్టార్‌ మెసేజ్‌లను ఒకేసారి తొలగించుకోవచ్చు కూడా. ఇవి కేవలం స్టార్డ్‌ మెసేజెస్‌ విభాగం నుంచే తొలగిపోతాయి. ఛాట్‌ బాక్స్‌లో అలాగే ఉంటాయి.

* ఒకవేళ మెసేజ్‌లను బుక్‌మార్కు చేసుకోవటం ఇష్టం లేకపోతే ఆయా మెసేజ్‌లను తేలికగా వెతికే సౌలభ్యమూ ఉంది. సెర్చ్‌ బాక్స్‌లో మెసేజ్‌లోని పదాలను టైప్‌ చేస్తే వాటితో కూడిన మెసేజ్‌లన్నీ వెంటనే దర్శనమిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని