ఫోన్‌ స్పీకరే ల్యాప్‌టాప్‌ స్పీకర్‌

ల్యాప్‌టాప్‌ పాతదై పోయింది. స్పీకర్లు సరిగా పనిచేయటం లేదు. బ్లూటూత్‌ స్పీకర్లు కూడా లేవు. మరి పాటల వంటివి వినటమెలా? ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌తో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొన్ని యాప్‌ల సాయంతో ల్యాప్‌టాప్‌ను ఫోన్‌ స్పీకర్‌తో

Published : 02 Feb 2022 01:12 IST

ల్యాప్‌టాప్‌ పాతదై పోయింది. స్పీకర్లు సరిగా పనిచేయటం లేదు. బ్లూటూత్‌ స్పీకర్లు కూడా లేవు. మరి పాటల వంటివి వినటమెలా? ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌తో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొన్ని యాప్‌ల సాయంతో ల్యాప్‌టాప్‌ను ఫోన్‌ స్పీకర్‌తో అనుసంధానించుకోవచ్చు.

ఆడియోరిలే: విండోస్‌ పీసీ, ల్యాప్‌టాప్‌ను ఫోన్‌తో అనుసంధానించుకోవటానికి ఈ యాప్‌లో చాలా ఫీచర్లున్నాయి. దీన్ని సెటప్‌ చేసుకోవటం తేలిక. ఇన్‌స్టాల్‌ చేసుకోగానే పీసీని దానంతటదే గుర్తిస్తుంది. నేరుగా ఫోన్‌ స్పీకర్లకు ఆడియోను చేరవేస్తుంది.

వైర్‌లెస్‌ స్పీకర్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌: ఇది ఆండ్రాయిడ్‌ పరికరాన్ని వైర్‌లెస్‌ స్పీకర్‌గా మార్చేస్తుంది. యూఎస్‌బీ టెథరింగ్‌, వైఫై హాట్‌స్పాట్‌తోనూ అనుసంధానమవుతుంది. నేరుగా పరికరాన్ని గుర్తించి ఆడియో ప్లే చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని