ఐఫోన్‌లో ప్రమాద గుర్తింపు ఫీచర్‌

కొత్త ఐఫోన్‌ వాడుతున్నారా? అయితే కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ వాడకం గురించి తెలుసు కోవాల్సిందే. ఇది అన్ని ఐఫోన్‌ 14 మోడళ్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా, రెండో తరం యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈలలోనూ అందుబాటులో ఉంటుంది.

Updated : 14 Sep 2022 05:53 IST

కొత్త ఐఫోన్‌ వాడుతున్నారా? అయితే కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ వాడకం గురించి తెలుసు కోవాల్సిందే. ఇది అన్ని ఐఫోన్‌ 14 మోడళ్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా, రెండో తరం యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈలలోనూ అందుబాటులో ఉంటుంది. యాక్సిలోమీటర్‌, గైరోస్కోప్‌ వంటి సెన్సర్ల ద్వారా పనిచేసే ఇది ప్రమాదంలో ముందు, వెనక, పక్క భాగాలు తీవ్రంగా దెబ్బతింటే గుర్తిస్తుంది. వెంటనే ఫోన్‌, వాచ్‌ తెర మీద హెచ్చరిక ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. అలారాన్ని వినిపిస్తుంది. ఎమర్జెన్సీ కాల్‌ స్లైడర్‌ను పక్కకు జరిపితే వెంటనే కాల్‌ చేసేస్తుంది. హెచ్చరిక కనిపించిన 10 సెకండ్ల తర్వాత ప్రతిస్పందించకపోతే మరో 10 సెకండ్లు వేచి చూస్తుంది. తర్వాత అదే అత్యవసర సేవలకు కాల్‌ చేసేస్తుంది. ప్రమాదాలకు సంబంధించిన సమాచారం సాయంతో పది లక్షల గంటలకు పైగా శిక్షణ ఇచ్చిన మోషన్‌ ఆల్గోరిథమ్‌లను దీనికి జతచేయటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని