కొత్త హెచ్‌పీ స్మార్ట్‌ ప్రింటర్‌!

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రింటర్‌ అనివార్యమైంది. ఇంటికైనా, చిన్న వ్యాపారాలకైనా తప్పనిసరి పరికరంగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌పీ ఇండియా స్మార్ట్‌ ట్యాంక్‌ పేరుతో కొత్త శ్రేణి ప్రింటర్‌ను విడుదల చేసింది.

Published : 14 Dec 2022 00:57 IST

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రింటర్‌ అనివార్యమైంది. ఇంటికైనా, చిన్న వ్యాపారాలకైనా తప్పనిసరి పరికరంగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌పీ ఇండియా స్మార్ట్‌ ట్యాంక్‌ పేరుతో కొత్త శ్రేణి ప్రింటర్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ ఫీచర్స్‌, మెరుగైన కనెక్టివిటితో కూడిన ఇది ముందే నింపిన సిరాతో 18వేల వరకు నలుపు తెలుపు పేజీలను, 6వేల వరకు కలర్‌ పేజీలను ముద్రించగలదు. హెచ్‌పీ స్మార్ట్‌ యాప్‌తో అనుసంధానమయ్యే దీంతో తేలికగా ప్రింట్‌, స్కాన్‌, కాపీ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్‌గా ఐడీలనూ గుర్తిస్తుంది. ఐడీ కాపీ బటన్‌తో ప్రింట్‌ చేసి పెడుతుంది. సున్నితమైన సమాచారాన్ని కాపాడటానికి హెచ్‌పీ వోల్ఫ్‌ ఎసెన్షియల్‌ సెక్యూరిటీ కూడా ఉంది. ఇంటి నుంచే చదువుకోవటం, పని చేయటం వంటి అవసరాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. హెచ్‌పీ స్మార్ట్‌ ట్యాంక్‌ మూడు శ్రేణుల్లో అందుబాటులో ఉంటుంది. హెచ్‌పీ స్మార్ట్‌ ట్యాంక్‌ 580 ధర రూ.18,848.. హెచ్‌పీ స్మార్ట్‌ ట్యాంక్‌ 520 ధర రూ.15,980.. హెచ్‌పీ స్మార్ట్‌ ట్యాంక్‌ 210 ధర రూ.13,326.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు