గూగుల్‌ ఫొటోస్‌ మెమరీస్‌ వినూత్నం

గూగుల్‌ ఈ సంవత్సరం ఆరంభంలో ఫొటోస్‌ యాప్‌లో మెమరీస్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గత సంవత్సరాల ఫొటోలను, ఇష్టమైన సందర్భాలను, ఆత్మీయులతో గడిపిన మధురమైన సంఘటనలను తిరిగి చూసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. దీన్ని తాజాగా మరింత ఆధునికీకరించింది.

Published : 21 Sep 2022 00:55 IST

గూగుల్‌ ఈ సంవత్సరం ఆరంభంలో ఫొటోస్‌ యాప్‌లో మెమరీస్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గత సంవత్సరాల ఫొటోలను, ఇష్టమైన సందర్భాలను, ఆత్మీయులతో గడిపిన మధురమైన సంఘటనలను తిరిగి చూసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. దీన్ని తాజాగా మరింత ఆధునికీకరించింది. అన్నింటికన్నా పెద్ద మార్పు వీడియో స్నిప్పెట్స్‌. దీంతో వీడియోలో అన్నింటికన్నా ముఖ్యమైన భాగాన్ని ఎంచుకొని, ట్రిమ్‌ చేసుకొని స్నిప్పెట్‌గా సేవ్‌ చేసుకోవచ్చు. కొత్తగా జూమ్‌ ఎఫెక్ట్‌నూ తీసుకొచ్చింది. దీని ద్వారా వివిధ ఫొటోలను కలిపి ‘ఫుల్‌ సినిమాటిక్‌ మెమరీ’ రూపంలోకీ మార్చుకోవచ్చు. ఇది సినిమాటిక్‌ ఫొటోస్‌ నుంచి డైనమిక్‌ 3డీ జూమ్‌ను ఉపయోగించుకుంటుంది. వచ్చే నెలలో ఈ వీడియోలకు సంగీతాన్ని జోడించే వెసులుబాటూ కల్పించనున్నారు. కొత్త కొలాజ్‌ ఎడిటర్‌ ఆప్షన్‌తో ఎంచుకున్న లేఅవుట్‌లో ఫొటోలను డ్రాగ్‌ చేసుకొని, ఎడిట్‌ చేసుకోవచ్చు. స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ఒన్‌ చందాదారులు, పిక్సెల్‌ ఫోన్‌ వాడేవారికైతే హెచ్‌డీఆర్‌, పోర్‌ట్రెయిట్‌ లైట్‌ వంటి మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. మెమరీస్‌కు ఆటోమేటిక్‌గా గ్రాఫిక్‌ ఆర్ట్‌ను వర్తింపజేసే ‘స్టైల్‌’ ఫీచర్‌ కూడా గూగుల్‌ ప్రవేశపెట్టింది. ఏ ఆండ్రాయిడ్‌తో పరికరం మీదైనా ఫొటోస్‌ యాప్‌లో నుంచి ‘షేర్డ్‌ మెమరీస్‌’ను యాక్సెస్‌ చేసుకోవటానికీ వీలు కల్పించింది. త్వరలో దీన్ని ఐఓఎస్‌ పరికరాలకు, వెబ్‌లోనూ వాడుకునేలా విస్తరించనున్నారు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని