యూట్యూబ్‌ గేమ్స్‌

యూట్యూబ్‌ అనగానే వీడియోలే గుర్తుకొస్తాయి. సినిమాలు, సంగీతం, క్రీడలు.. ఒక్కటేమిటి? ఎలాంటి వీడియోలైనా చూడొచ్చు. మరి యూట్యూబ్‌లో గేమ్స్‌ కూడా ఆడుకోవచ్చని మీకు తెలుసా?

Updated : 20 Dec 2023 01:20 IST

యూట్యూబ్‌ అనగానే వీడియోలే గుర్తుకొస్తాయి. సినిమాలు, సంగీతం, క్రీడలు.. ఒక్కటేమిటి? ఎలాంటి వీడియోలైనా చూడొచ్చు. మరి యూట్యూబ్‌లో గేమ్స్‌ కూడా ఆడుకోవచ్చని మీకు తెలుసా? యూట్యూబ్‌వెబ్‌ ఇంటర్ఫేస్‌, యూట్యూబ్‌ మొబైల్‌ యాప్‌ రెండింటిలోనూ ఇది సాధ్యమే. కాకపోతే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని ఉండాలి. ప్రయోగాత్మక ఫీచర్లలో భాగం కావటం వల్ల ప్రస్తుతం వీరికి మాత్రమే యూట్యూబ్‌లో గేమ్స్‌ ఆడుకోవటానికి అనుమతిస్తున్నారు. పజిల్స్‌, ఆర్కేడ్‌, స్పోర్ట్స్‌, స్ట్రాటజీ, బోర్డు, రేసింగ్‌, సిమ్యులేషన్‌ గేమ్స్‌ వంటి బోలెడన్ని ఆటలు ఇందులో ఉన్నాయి. ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎక్కువుంటే మరింత బాగా ఆస్వాదించొచ్చు.

  • ముందుగా యూట్యూబ్‌లోకి వెళ్లి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఖాతాకు లాగిన్‌ అవ్వాలి.
  •  ప్రొఫైల్‌ పిక్చర్‌ గుర్తు మీద నొక్కి, కింది జాబితాలో ‘యువర్‌ ప్రీమియం బెనిఫిట్స్‌’ ఎంచుకోవాలి.
  •  తర్వాత ‘ట్రై ఎక్స్‌పెరిమెంటల్‌ న్యూ ఫీచర్స్‌’ మీద క్లిక్‌ చేస్తే ‘ప్లే గేమ్స్‌ ఆన్‌ యూట్యూబ్‌’ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ‘ట్రై ఇట్‌ అవుట్‌’ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  •  అనంతరం యూట్యూబ్‌ హోంపేజీలోకి వెళ్లి, మెనూ గుర్తును నొక్కాలి. కిందికి విస్తరించే జాబితాలో ‘ప్లేయబుల్స్‌’ను ఎంచుకుంటే దీనికి సంబంధించిన హోం పేజీ కనిపిస్తుంది.
  •  హోం బటన్‌ మీద క్లిక్‌ చేస్తే పాపులర్‌ గేమ్స్‌ కనిపిస్తాయి. ‘బ్రౌజ్‌’ మీద క్లిక్‌ చేస్తే ఇతరత్రా గేమ్స్‌ ప్రత్యక్షమవుతాయి.
  •  ఇష్టమైన గేమ్‌ను ఎంచుకొని, ఆయా సూచనలు పాటిస్తూ గేమ్స్‌ ఆడేసుకోవచ్చు. వీటిని ఆఫ్‌లైన్‌లో ఆడటం, డౌన్‌లోడ్‌ చేయటం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని