వాట్సప్‌లో అదృశ్య ఫీచర్‌

వాట్సప్‌లో రోజూ ఎన్నో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకుంటుంటాం. వీటిని ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. కానీ మీరు పంపించిన ఫొటోలు, వీడియోలను అవతలివారు ఒకసారి మాత్రమే చూసే వీలుంటే? తర్వాత అవన్నీ అదృశ్యమైతే? ఇలాంటి కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ తమ బీటా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది

Published : 07 Jul 2021 01:28 IST

వాట్సప్‌లో రోజూ ఎన్నో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకుంటుంటాం. వీటిని ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. కానీ మీరు పంపించిన ఫొటోలు, వీడియోలను అవతలివారు ఒకసారి మాత్రమే చూసే వీలుంటే? తర్వాత అవన్నీ అదృశ్యమైతే? ఇలాంటి కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ తమ బీటా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘వ్యూ ఒన్స్‌’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌పైరింగ్‌ మీడియా ఫీచర్‌ మాదిరిగానే ఇది పనిచేస్తుంది. వ్యూ ఒన్స్‌ ఫీచర్‌ ద్వారా పంపించిన ఫొటలు, వీడియోలు అవతలి వాళ్లు ఒకసారి ఓపెన్‌ చేసి, ఛాట్‌ నుంచి బయటకు వచ్చేంతవరకే ఉంటాయి. అనంతరం మాయమైపోతాయి. వ్యూ ఒన్స్‌ ఫీచర్‌ వాట్సప్‌ 1.21.14.3 ఆండ్రాయిడ్‌ వర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది మీ వాట్సప్‌లో కనిపించనట్టయితే ఇంకా మీరు పొందలేదన్నమాట. దీన్ని పొందినవారు గ్యాలరీలోంచి ఫొటోనో, వీడియోనో ఎంచుకొని గడియారం లాంటి ఐకాన్‌ మీద నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు ‘యాడ్‌ ఎ క్యాప్షన్‌’ బార్‌ కనిపిస్తుంది. అనంతరం స్నేహితులకో, కుటుంబసభ్యులకో పంపించుకోవచ్చు. అవతలివాళ్లు రీడ్‌ రిసీప్ట్స్‌ను డిసేబుల్‌ చేసుకున్నా వాళ్లు చూశారో, లేదో మీకు తెలిసే వీలుండటం గమనార్హం. కాకపోతే ఎప్పుడు ఓపెన్‌ చేశారన్నది మాత్రం తెలియదు. అదృశ్యమయ్యే ఫొటోను గ్రూప్‌లో షేర్‌ చేసుకున్నా ఎవరెవరు దాన్ని చూశారో కూడా తెలుస్తుంది. కామన్‌ గ్రూప్‌లలో బ్లాక్‌ చేసిన వారూ వీటిని చూడటానికి వీలుంటుంది. వ్యూ ఒన్స్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోనివారికి ఫొటోలను పంపించినా ఇది పనిచేస్తుంది. ఇలాంటి ఫొటోలను, వీడియోలను స్క్రీన్‌షాట్‌ తీసుకోవచ్చు. స్క్రీన్‌ రికార్డింగు చేసుకోవచ్చు. పంపించినవారికిది తెలియదు. ప్రస్తుతం బీటా వర్షన్‌లోనే పనిచేస్తున్నా త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని