ఇన్‌స్టాలో రీపోస్ట్‌

ట్వీట్లను రీట్వీట్‌ చేయటం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ సైతం ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తేనుంది. స్టోరీలను రీషేర్‌ చేసినట్టుగానే ఫీడ్‌లోని పోస్ట్‌లను రీషేర్‌ చేసే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది.

Updated : 14 Sep 2022 01:21 IST

ట్వీట్లను రీట్వీట్‌ చేయటం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ సైతం ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తేనుంది. స్టోరీలను రీషేర్‌ చేసినట్టుగానే ఫీడ్‌లోని పోస్ట్‌లను రీషేర్‌ చేసే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. దీంతో ఇతరుల పోస్ట్‌లను రీపోస్ట్‌ చేయటానికి వీలవుతుంది. ఆయా పోస్ట్‌లను క్రియేట్‌ చేసివారికి ఆదరణా పెరుగుతుంది. కొందరు వినియోగదారులతో త్వరలోనే దీనిపై పరీక్షలు నిర్వహించాలని ఇన్‌స్టాగ్రామ్‌ భావిస్తోంది. యూజర్ల ప్రొఫైల్‌ మీద పోస్ట్స్‌, రీల్స్‌, ట్యాగ్డ్‌ ఫోటోస్‌ ట్యాబ్‌ల పక్కనే ఈ కొత్త రీపోస్ట్‌ ట్యాబ్‌ కూడా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని