యాంటీమ్యాటరూ కిందికే!

అంతుచిక్కని వ్యతిరేక పదార్థానికి (యాంటీమ్యాటర్‌) సంబంధించి అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం గొప్ప విషయాన్ని గుర్తించింది. ఇది మామూలు పదార్థం మాదిరిగానే గురుత్వాకర్షణకు స్పందిస్తున్నట్టు తేలింది. వ్యతిరేక పదార్థంలో ప్రోటాన్లకు బదులు యాంటీప్రోటాన్లు, ఎలక్ట్రాన్లకు బదులు యాంటీఎలక్ట్రాన్లు (పోసిట్రాన్స్‌) ఉంటాయి.

Published : 04 Oct 2023 00:12 IST

అంతుచిక్కని వ్యతిరేక పదార్థానికి (యాంటీమ్యాటర్‌) సంబంధించి అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం గొప్ప విషయాన్ని గుర్తించింది. ఇది మామూలు పదార్థం మాదిరిగానే గురుత్వాకర్షణకు స్పందిస్తున్నట్టు తేలింది. వ్యతిరేక పదార్థంలో ప్రోటాన్లకు బదులు యాంటీప్రోటాన్లు, ఎలక్ట్రాన్లకు బదులు యాంటీఎలక్ట్రాన్లు (పోసిట్రాన్స్‌) ఉంటాయి. మామూలు పదార్థ అణువుల్లో ప్రోటాన్లు ధనావేశం కలిగుంటే యాంటీప్రోటాన్లు రుణావేశం కలిగుంటాయి. ఎలక్ట్రాన్లు రుణావేశాన్ని కలిగుంటే పొసిట్రాన్లు ధనావేశాన్ని కలిగుంటాయి. అందువల్ల వ్యతిరేక పదార్థం గురుత్వాకర్షణ ప్రభావానికి గురికాక పోవచ్చని భావిస్తుంటారు. కానీ ధనావేశిత పొసిట్రాన్‌ చుట్టూ యాంటీప్రోటాన్‌ తిరిగేలా రూపొందించిన యాంటీహైడ్రోజన్‌ సైతం గురుత్వాకర్షణ ప్రభావంతో కిందికి దిగుతున్నట్టు పరిశోధకులు నిరూపించారు. అంతర్గత నిర్మాణాలు వేర్వేరుగా ఉన్నా అన్ని ద్రవ్యరాశులూ గురుత్వాకర్షణకు ఒకేలా స్పందిస్తాయని ఐన్‌స్టీన్‌ వందేళ్ల క్రితం తన సాపేక్ష సిద్ధాంతంలో ప్రతిపాదించారు. అది నిజమేనని తాజా పరిశోధన ధ్రువీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని