Insta: సెక్యూరిటీ చెక్‌తో..మీ డేటా భద్రం 

యూజర్స్ డేటా భద్రత విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. అయినప్పటికీ డేటా లీక్ అనే వార్తలను అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా ఇన్‌స్టాగ్రాం యూజర్‌ ఖాతాల భద్రతకు సంబంధించి సెక్యూరిటీ చెక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని సాయంతో యూజర్స్ తమ ఖాతాలు హ్యాక్‌ చేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు...

Updated : 15 Jul 2021 22:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్స్ డేటా భద్రత విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. అయినప్పటికీ డేటా లీక్ అనే వార్తలను అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా ఇన్‌స్టాగ్రాం యూజర్‌ ఖాతాల భద్రతకు సంబంధించి సెక్యూరిటీ చెక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని సాయంతో యూజర్స్ తమ ఖాతాలు హ్యాక్‌ చేశారా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఖాతా హ్యాక్‌ చేస్తే మీరు లాగిన్ అయ్యేప్పుడు సెక్యూరిటీ చెక్ చేయమని అడుగుతుంది. అందులో మీ లాగిన్‌ సమాచారంతో పాటు ప్రొఫైల్ రివ్యూ చేసి ఖాతా మీదేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల యూజర్స్ ఎప్పటికప్పుడు తమ ఖాతాలను సెక్యూర్ చేసుకుంటారని ఫేస్‌బుక్ తెలిపింది. దీంతోపాటు ఇన్‌స్టా ఖాతాల భద్రతకు సంబంధించి మరో రెండు మార్గాలను సూచించింది. 

* మొదటిది టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రాంలో అందుబాటులో లేదు. త్వరలోనే దీన్ని ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేయనున్నట్లు సమాచారం. అలానే డ్యూయో మొబైల్, గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్స్ ద్వారా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్‌తో సెక్యూర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పద్ధతి కూడా విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌లో వీటిని పరిచయం చేయనున్నట్లు సమాచారం.  

* రెండోది ఇన్‌స్టాగ్రాం ఎప్పుడూ డైరెక్ట్‌ మెసేజ్‌లను యూజర్స్‌కి పంపదు. ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రాం పేరుతో పాస్‌వర్డ్ మార్చుకోమని డైరెక్ట్‌ మెసేజ్ వస్తే దాన్ని నమ్మకండి. అలానే యూజర్స్ ఇన్‌స్టాగ్రాం ఏవైనా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే వాటిపై ఫిర్యాదు చేయమని సూచించింది. ఇందుకోసం మీకు అనుమానం కలిగిన పోస్ట్‌ పైభాగంలోని మూడు చుక్కలపై క్లిక్ చేస్తే పాప్అప్‌ విండో ఓపెన్ అవుతుంది. అందులో రిపోర్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వివిధ కారణాలతో కూడిన జాబితా కనిపిస్తుంది. వాటిలో ఏ కారణం చేత మీకు వీడియోపై అనుమానం కలిగింతో దానిపై క్లిక్ చేసి సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇవేకాకుండా ఇన్‌స్టాగ్రాం రీషేర్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. స్టోరీస్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని