
iPhone 11: యాపిల్ నుంచి మరో గొప్ప డీల్.. ₹15 వేలుతగ్గింపు!
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి మరో గొప్ప డీల్. ఐఫోన్ 11 (iPhone 11) సిరీస్‌పై కంపెనీ భారీ తగ్గింపును ప్రకటించింది. బిగ్ డిస్ప్లే (5.94 అంగుళాలు), మెచ్చుకోదగ్గ బ్యాటరీ, ఐవోఎస్ తాజా వెర్షన్, రెండు కెమెరాల సెటప్‌తో వస్తున్న ఈ మొబైల్‌పై కంపెనీ ఏకంగా రూ.15 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. పాత మోడల్స్‌ను వదిలించుకోవాలనుకునే వారికి ఇది సదావకాశం.
ఇవే ఆఫర్లు..
* ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో ఐఫోన్ 11 మోడల్ 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.49,900గా ఉంది. దీనిని హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే రూ.4 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంటే రూ.45,900కే ఈ మొబైల్ లభిస్తుంది.
* మరోవైపు పాత ఐఫోన్ మోడల్స్‌పై ప్రస్తుతం ఎక్స్ఛేంజీ బోనస్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ 7 ఉండి, అది మంచి స్థితిలో ఉంటే రూ.11 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా పై ఆఫర్‌నూ వినియోగించి మొత్తంగా రూ.15 వేల రాయితీ పొందొచ్చు. అలాగైతే ఐఫోన్ 11ను రూ.34,900కే లక్కీగా కొనుగోలు చేసుకోవచ్చు.
* అలాగే పాత ఇతర మోడల్స్‌పై కూడా ఎక్స్ఛేంజీ సదుపాయం అందుబాటులో ఉంది. ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ఆర్ (iPhone XR)పై మీరు మరింత ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. మీ వద్ద ఐఫోన్ XR ఉన్నట్లయితే ఐఫోన్ 11కి బదులు 13కి వెళ్లండి. ఐఫోన్ 11, ఎక్స్ఆర్లో దాదాపు ఒకేరకమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.