Meta: వాట్సాప్‌, యూట్యూబ్‌ యూజర్లకు ‘ఫేస్‌బుక్‌’ కీలక సూచన..!

ఆండ్రాయిడ్‌ యూజర్లకు నకిలీ యాప్స్‌ నుంచి ముప్పు పొంచి ఉందని మెటా సంస్థ వెల్లడించింది. డ్రాకేరిస్‌ అనే మాల్‌వేర్‌ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్‌, యూట్యూబ్‌ యాప్‌లను కనిపించకుండా చేస్తుందని తెలిపింది...

Updated : 14 Aug 2022 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ యూజర్లకు నకిలీ యాప్స్‌ నుంచి ముప్పు పొంచి ఉందని మెటా సంస్థ వెల్లడించింది. డ్రాకేరిస్‌ అనే మాల్‌వేర్‌ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్‌, యూట్యూబ్‌ యాప్‌లను కనిపించకుండా చేస్తుందని తెలిపింది. ఇటీవల మెటా విడుదల చేసిన క్వార్టర్లీ అడ్వైర్సల్‌ థ్రెట్‌ రిపోర్ట్ 2022లో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ దేశాల్లోని యూజర్లు లక్ష్యంగా బిట్టర్‌ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్‌ ఈ మాల్‌వేర్‌ను పలు గేమింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల మొబైల్స్‌లోకి పంపుతున్నట్లు తెలిపింది.

ఈ మాల్‌వేర్‌ సాయంతో హ్యాకర్స్‌ యూజర్ల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌, కాంటాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌, ఫైల్స్‌, ఎస్సెమ్మెస్‌ టెక్ట్స్‌, జియో లోకేషన్‌తోపాటు డివైజ్‌ వివరాలను సేకరిస్తున్నారని రిపోర్ట్‌లో పేర్కొంది. యూజర్‌ అనుమతిలేకుండా యాప్స్‌ ఇన్‌స్టాల్ చేయడం, ఫొటోలు తీయడం, మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ చేయొచ్చని తెలిపింది. ఫోన్‌లోని యాంటీ-వైరస్‌ సిస్టమ్‌ను బైపాస్‌ చేయగల సామర్థ్యం ఈ మాల్‌వేర్‌కు ఉందని మెటా సంస్థ పేర్కొంది. ఈ మాల్‌వేర్‌ బారినపడకుండా ఉండేందుకు యూజర్లు నకిలీ యాప్‌లతోపాటు, అదనపు ఫీచర్ల కోసం థర్డ్‌-పార్టీ ఏపీకే వెబ్‌సైట్ల నుంచి వాట్సాప్‌, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయొద్దని సూచించింది. ప్లే స్టోర్‌ ప్రొటెక్షన్‌ ఉన్న యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు యూజర్లను కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని