
Microsoft Teams: ఇక మీ ఫోనే వాకీ టాకీ.. అందుబాటులోకి టీమ్స్ కొత్త ఫీచర్
ఇంటర్నెట్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వీడియో కాలింగ్ యాప్ టీమ్స్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ రెండేళ్ల క్రితం ఫ్రంట్‌లైన్ వర్కర్లు కరోనా సమయంలో సులువుగా సంభాషించుకునేందుకు వీలుగా టీమ్స్‌లో వాకీ టాకీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. టీమ్స్ యాప్‌లో పుష్-టు-టాక్ (Push-To-Talk) పేరుతో ఈ ఫీచర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా యూజర్స్ తమ బృందంలోని వారితో సంభాషించవచ్చు. అనుమతిలేకుండా బయటి వ్యక్తులు ఎవరూ ఈ సంభాషణలు వినలేరు. దీనివల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రత్యేకంగా వాకీటాకీలు, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజ్‌లను తమతోపాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. జీబ్రా మొబైల్ డివైజెస్ అనే సంస్థతో కలిసి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
వాకీ టాకీ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కు అందుబాటులో ఉంది. ఇందులో టీసీ-సిరీస్, కస్టమర్-ఫేసింగ్ ఈసీ-సిరీస్, స్కానింగ్ డివైజ్‌లకు సంబంధించిన ఎమ్సీ - సిరీస్‌లు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చెబుతోంది. వీటి సేవలను యూజర్స్ సింగిల్ క్లిక్‌తో పొందవచ్చని తెలిపింది. అలాగే, టీమ్స్ వాకీ టాకీ ఫీచర్‌తో సంభాషించేప్పుడు, సాధారణ వాకీ టాకీలో మాదిరిగా బటన్ ప్రెస్ చేసి ఉంచాల్సిన అవసరంలేదని వెల్లడించింది. దీని ద్వారా మాట్లాడే ప్రతి మాట రికార్డైన తర్వాతే రిసీవర్‌కు పంపబడుతుందని టీమ్స్ తెలిపింది. ఈ ఫీచర్ కోసం యూజర్స్ టీమ్స్ యాప్‌లో అడ్మిన్ సెంటర్ ద్వారా యాప్ సెటప్ పాలసీని యాడ్ చేసుకోవాలని సూచించింది. తర్వాత వాకీ టాకీ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే 48 గంటల తర్వాత ఉపయోగించుకోవచ్చని తెలిపింది.