Motorola: మడతపెట్టే మొబైల్స్‌లో.. మోటోరోలా మరో అడుగు ముందుకు!

మరో కొత్తతరం ఫోల్డబుల్‌ మోడల్‌ను తీసుకొచ్చేందుకు మోటోరోలా  సిద్ధమైంది. ఈ మేరకు WIPO (వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్)లో పేటెంట్‌ దాఖలు చేసింది.

Published : 07 Feb 2022 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మడతపెట్టే మొబైల్స్‌కు నాంది పలికిన మోటోరోలా.. ఇప్పుడు మరో కొత్తతరం ఫోల్డబుల్‌ మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు WIPO (వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్)లో పేటెంట్‌ దాఖలు చేసింది. దీని ప్రకారం.. కొత్తగా తీసుకురాబోయే మోటోరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌లో స్క్రీన్‌ను లోపలికి బదులుగా బయటికి మడత పెట్టాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు ఫోన్‌ ముందూ వెనుక డిస్‌ప్లే ఉంటుంది. ఫ్రంట్‌, బ్యాక్ ప్రైమరీ కెమెరాలతో కాకుండా ఈ ప్యానెల్‌ ఒకేఒక్క కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. ఒకవేళ సెల్ఫీ తీసుకోవాలంటే మాత్రం మొబైల్‌ను మడత పెట్టాల్సిందే. 

అయితే, ఇది ఇప్పటివరకు పేటెంట్‌ మాత్రమే. ఈ మోడల్‌ను మోటోరోలా ఇప్పటికిప్పుడే తీసుకొస్తుందని కచ్చితంగా చెప్పలేం. 1996లో మొట్టమొదటి మడతపెట్టే మొబైల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మోటోరోలా.. ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగించాలని భావిస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల రేజర్‌ 5జీ పేరుతో ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అల్ట్రా ప్రీమియం డిజైన్‌, అత్యుత్తమ సెల్ఫీ కెమెరా, ఫ్లెక్సిబుల్ డిజైన్‌ దీని ప్రత్యేకతలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని