Charger: బాక్సులో ఛార్జర్లకు ఆ రెండు కంపెనీలూ గుడ్‌బై!?

రిటైల్‌ బాక్సులో ఛార్జర్‌ను తొలగించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది యాపిల్‌ బాటలోనే మరో రెండు కంపెనీలు పయనించనున్నాయి.  భారత్‌లో విక్రయించే ఫోన్ల విషయంలో ఛార్జర్‌ను తొలగించాలని భావిస్తున్నాయట. 

Published : 17 Nov 2022 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిటైల్‌ బాక్సులో ఛార్జర్‌ను తొలగించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది యాపిల్‌. ఆ తర్వాత శాంసంగ్ సైతం అదే బాటను అనుసరించింది. ఇప్పుడు చైనాకు చెందిన రెండు కంపెనీలు సైతం బాక్సుల నుంచి ఛార్జర్‌ను తొలగించడానికి సన్నద్ధమవుతున్నాయని తెలిసింది. భారత్‌లో విక్రయించే ఫోన్ల విషయంలో ఛార్జర్‌ను తొలగించాలని వన్‌ప్లస్‌, ఒప్పో అనుకుంటున్నాయని ప్రముఖ టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు. అయితే, దీనిపై రెండు కంపెనీలు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

యాపిల్‌ అన్ని ఫోన్లకూ ఛార్జర్లను తొలగించింది. శాంసంగ్‌ సైతం తన ప్రీమియం ఫోన్లకు ఛార్జర్లను నిలిపివేసింది. బడ్జెట్‌ ఫోన్లకు మాత్రం కొనసాగిస్తోంది. అయితే, పర్యావరణ పరిరక్షణలో భాగంగానే తమ వంతుగా ఛార్జర్‌ను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. కానీ, రిటైల్‌ బాక్సులో ఛార్జర్‌ను తొలగిస్తున్న కంపెనీలు.. విడిగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో ఇయర్‌ఫోన్స్‌ను బాక్సుతో పాటు ఇచ్చిన సంస్థలు.. తర్వాత దాదాపు అన్ని కంపెనీలూ వాటిని తొలగించాయి. అదే తరహాలో ఇప్పుడు ఒక్కో కంపెనీ ఛార్జర్‌ను తొలగిస్తుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని