
Sony: సోనీ నెక్‌బ్యాండ్ స్పీకర్లు వచ్చేశాయ్.. ధరెంతంటే?
దిల్లీ: సోనీ నుంచి రెండు సరికొత్త వైర్‌లెస్ నెక్ బ్యాండ్ స్పీకర్లు భారత్‌లోకి వచ్చేశాయ్. SRS-NS7, SRS-NB10 పేర్లతో వీటిని సంస్థ లాంచ్ చేసింది. SRS-NS7 నెక్‌బ్యాండ్ డాల్బీ 3డీ అట్మాస్ సౌండ్‌ను అందిస్తుంది. ‘సోనీ బ్రావియా XR’ టీవీలోని 360 స్పేషియల్ సౌండ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి... దీన్ని WLA-NS7 ట్రాన్స్‌మిటర్‌తో రూపొందించారు. 360 స్పేషియల్ సౌండ్ పర్సనలైజర్ అనే యాప్ ద్వారా ఈ నెక్ బ్యాంక్ స్పీకర్‌ను ‘సోనీ బ్రావియా XR’ టీవీతో కనెక్ట్ చేసి సౌండ్‌ను ఆస్వాదించొచ్చు. అప్పుడు యూజర్ల చెవి 3డీ ఆకృతిని అంచనా వేసి వర్చువల్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా క్రిస్టల్ క్లియర్, X-బ్యాలెన్స్‌డ్ స్పీకర్ యూనిట్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫంక్షనాలిటీతో ఈ నెక్‌బ్యాండ్ స్పీకర్ వస్తుంది. ఒకేసారి రెండు డివైజ్‌లతో ఈ నెక్‌బ్యాండ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందట.
SRS-NB10 నెక్‌బ్యాండ్ స్పీకర్ కాల్స్ మాట్లాడటానికి, సంగీతం వినడానికి కూడా సహకరిస్తుంది. కచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీ, 20 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. సోనీ విడుదల చేసిన ఈ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్లు IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్ సాంకేతికతతో వస్తున్నాయి. భారత్‌లోని సోనీ సెంటర్లు, ఇ-కామర్స్ సైట్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్‌లలో జనవరి 24 నుంచి ఈ నెక్‌బ్యాండ్‌లు అందుబాటులోకి వచ్చాయి. SRS-NBS10 నెక్‌బ్యాండ్ స్పీకర్ ధర ₹11,990 ఉండగా, SRS-NS7 నెక్‌బ్యాండ్‌ను ₹22,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే WLA-NS7 వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్ ధర ₹5,690.
ఇవీ చదవండి
Advertisement