Windows 11: అప్డేట్కు ఏం కావాలో ఈ యాప్ చెప్పేస్తుంది!
తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 పేరుతో కొత్త ఓఎస్‌ను తీసుకొచ్చింది. గత ఓఎస్‌లకు భిన్నంగా..యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో విండోస్ 11ను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఉపయోగించే సిస్టంలో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని షరతు విధించింది...
ఇంటర్నెట్‌డెస్క్: తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 పేరుతో కొత్త ఓఎస్‌ను తీసుకొచ్చింది. గత ఓఎస్‌లకు భిన్నంగా.. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో విండోస్ 11ను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఉపయోగించే సిస్టంలో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని షరతు విధించింది. ఇందుకోసం పీసీ హెల్త్ అనే యాప్‌ను విడుదల చేసింది. ఇది మీరు ఉపయోగిస్తున్న సిస్టంను పరీక్షించి విండోస్ 11 అప్డేట్ అవుతుందా లేదా అనేది యూజర్‌కి తెలియజేస్తుంది. అయితే విండోస్ 11 ఎందుకు అప్డేట్ కాదనే దానికి మాత్రం కచ్చితత్వంతో చెప్పపోవడంతో దీని పనీతీరుపై యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా గిట్‌హబ్ అనే సాఫ్ట్వేర్ సంస్థ WhyNotWin11 అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఇది సిస్టంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఏయే విభాగాలు విండోస్ 11ని సపోర్ట్ చేస్తాయి? వేటిని అప్‌గ్రేడ్ చేయాలనేది సూచిస్తుంది.
ఉదాహరణకు మీ సిస్టం 32-బిట్ సిస్టం అయితే దానిని రెడ్ మార్క్‌లో చూపిస్తుంది. ఎందుకంటే విండోస్ 11 అప్డేట్కు 64-బిట్ సిస్టం అవసరం. అలానే ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, బూట్ టైప్, టీపీఎం వెర్షన్, గ్రాఫిక్ కార్డ్ వంటి వాటిని కూడా పరిశీలించి విండోస్ 11ని సపోర్ట్ చేసే విభాగాలను గ్రీన్ కలర్లో, సపోర్ట్ చేయని వాటిని రెడ్ కలర్లో చూపిస్తుంది. WhyNotWin11 యాప్‌ని ఎవరైనా గిట్‌హబ్ వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే యూజర్స్ నుంచి వస్తున్న అభిప్రాయలను పరిగణనలోకి తీసుకున్న మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ యాప్‌ను కూడా అప్డేట్ చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లేస్టోర్‌లో ప్రభుత్వ బ్యాడ్జి
ప్రభుత్వ ప్రాయోజిత యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ యాప్‌లను తేలికగా గుర్తించటానికి గూగుల్ ప్లే స్టోర్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. -
కట్ చేయకుండానే..
వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తేవటానికి కట్, పేస్ట్ చేయటం తెలిసిందే. -
100 జీబీపీఎస్ వేగంతో 6జీ
డేటా పంపిణీ వేగం రోజురోజుకీ పెరుగుతోంది. 4జీ, 5జీలను దాటుకొని 6జీలోకి అడుగిడుతోంది. ఈ దిశగా జపాన్‌లోని కంపెనీల సముదాయం గొప్ప ముందడుగు వేసింది -
మైక్రోసాఫ్ట్ 2ఎఫ్ఏ ఎలా?
మైక్రోసాఫ్ట్ ఖాతాను మరింత సురక్షితం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే టూఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను (2ఎఫ్ఏ) సెట్ చేసుకోండి. రోజురోజుకీ హ్యాకింగ్ పద్ధతులు తెలివి మీరుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరి. -
గూగుల్ ఖాతా భద్రం
‘ఫేస్బుక్లో అలాంటి పోస్ట్ పెట్టావేంటి?’ అని మిత్రులెవరైనా అడిగారా? మీరు పంపించని మెయిళ్లు అవుట్బాక్సులో కనిపిస్తున్నాయా? మీ పేరు మీద ఎవరో రుణాలు తీసుకున్నట్టు గుర్తించారా? ఇవీ ఒకరకం మోసాలే. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్