వాట్సాప్‌లో ఫొటోలూ మాయం అవుతాయ్‌!

వాట్సాప్‌లో మీ ఫ్రెండ్‌కి ఓ ఫొటో/వీడియో పంపించారు. అయితే ఆ ఫొటో/వీడియోను అతను వేరే ఎవరికీ ఫార్వర్డ్‌ చేయకూడదు. అసలు అతని మొబైల్‌లో సేవ్‌ కాకూడదు.

Updated : 03 Mar 2021 20:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌లో మీ ఫ్రెండ్‌కి ఓ ఫొటో పంపించారు. అయితే ఆ ఫొటో అతను వేరే ఎవరికీ ఫార్వర్డ్‌ చేయకూడదు. అసలు అతని మొబైల్‌లో సేవ్‌ కాకూడదు. దీని కోసం ఇప్పుడైతే.. ఆ విషయం మెసేజ్‌ రూపంలోనో, లేదంటే కాల్‌ చేసి అతనికి చెప్పాలి. అయితే త్వరలో మీకీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాట్సాప్‌ యూజర్లు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ ఫొటోస్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఈ తరహా ఫీచర్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుందంటే?

వాట్సాప్‌లో ఇప్పటికే డిస్‌అపియరింగ్‌‌ మెసేజెస్‌ ఫీచర్ ఉంది. అయితే ఈ ఆప్షన్‌ యాక్టివ్‌ చేసుకుంటే వారం తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అవుతాయి. సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ మీడియా ఆప్షన్‌తో అయితే అవతలి వ్యక్తి చూడగానే మీరు పంపిన ఫొటోలు డిలీట్‌ అయిపోతాయి. దీని కోసం ఫొటో షేర్‌ చేసే ముందు, యాడ్‌ కాప్షన్‌ అనే బాక్స్‌ పక్కన ఉండే గడియారం సింబల్‌ను టచ్‌ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో అవతలి వ్యక్తి చూసి, ఛాట్‌ స్క్రీన్‌ నుంచి బయటకు రాగానే డిలీట్‌ అయిపోతుంది. ఈ ఫీచర్ ఆధారంగా మీరు పంపిన ఫొటోలు ఇతరులకు షేర్‌ చేయడం, గ్యాలరీలో సేవ్‌ చేసుకోవడం వంటివి కుదరవు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ వినియోగించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని