WhatsApp: వాట్సాప్‌ కెప్ట్‌ మెసేజ్‌.. ఇకపై మెసేజ్‌లు డిస్‌అప్పియర్‌ కావు!

వాట్సాప్‌ డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌కు అనుబంధంగా కెప్ట్‌ మెసేజెస్‌ అనే పేరుతో కొత్త ఫీచర్‌ రాబోతుంది. ఈ ఫీచర్‌తో డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్‌ను కూడా డిలీట్‌ అవ్వకుండా చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం... 

Updated : 12 Aug 2022 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌తో మెసేజ్‌ పంపిన వ్యక్తి చాట్‌ పేజీతోపాటు అవతలి వ్యక్తి చాట్‌ పేజీ నుంచి వాటిని డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టైమ్‌ లిమిట్ 1 గంట 8 నిమిషాల 16 సెకన్లు ఉండగా, త్వరలోనే దాన్ని రెండు రోజుల 12 గంటలకు పొడిగించనున్నారు. ఈ ఫీచర్‌కు అనుబంధంగా కొత్త పీచర్‌ను పరిచయం చేయనున్నారు. వాట్సాప్‌ కెప్ట్‌ మెసేజెస్‌ (WhatsApp Kept Messages) అనే పేరుతో  తీసుకొస్తున్న ఫీచర్‌తో డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్‌ (Disappeaaring Messages)ను కూడా డిలీట్‌ అవ్వకుండా చేయొచ్చు.

డిస్‌అప్పియరింగ్‌ ఫీచర్‌ ద్వారా పంపిన మెసేజ్‌లను టైమ్‌ లిమిట్‌లోపు ఆటో డిలీట్ అవ్వకుండా కెప్ట్‌ (Kept) చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వ్యక్తిగత చాట్ సంభాషణలతోపాటు, గ్రూపు సంభాషణలకు ఈ ఫీచర్‌ వర్తిస్తుంది. గ్రూప్‌ చాట్‌లో ఎవరైనా డిస్‌అప్పియరింగ్‌ మెసేజ్‌లను కెప్ట్‌‌, అన్‌-కెప్ట్‌ చేయొచ్చు. గ్రూప్‌లో ఎన్ని మెసేజ్‌లు కెప్ట్ చేయాలనే అధికారం గ్రూప్‌ అడ్మిన్‌లకు ఉంటుంది. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లో వాట్సాప్‌ మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. 

వాట్సాప్‌ వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌, బల్క్‌ మెసేజ్‌ డిలీట్, పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌, వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌ వంటి ఫీచర్లను పరిచయం చేయనుంది. ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌ (Preview Message Reactions)తో ఎవరెవరు ఏ మెసేజ్‌లకు ఎమోజీలతో రిప్లై ఇచ్చారనేది తెలుస్తుంది. బల్క్‌ మెసేజ్‌ డిలీట్‌ (Bulk Message Delete)తో డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ (Delete for Everyone) ద్వారా పంపిన మెసేజ్‌లను ఒకటి కన్నా ఎక్కువ డిలీట్ చేయొచ్చు. పాస్ట్ పార్టిసిపెంట్స్‌ (Past Participants)తో గ్రూపు నుంచి ఎవరెవరు వెళ్లిపోయారనేది తెలుస్తుంది. ఇక వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌తో ఆడియో మెసేజ్‌ (Audio Messages)లను కూడా వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని