Published : 20 Jan 2022 05:28 IST

అన్ని తరగతుల్లో ఒకేసారి ఆంగ్ల మాధ్యమం

అజీం ప్రేమ్‌జీ వర్సిటీతో కలిసి ఉపాధ్యాయులకు శిక్షణ
ఆసక్తి ఉన్నవారికి తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తాం
విలేకర్లతో మంత్రి సబిత

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్లాలంటే పదో తరగతికి వచ్చేసరికి పదేళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే తెలుగు మాధ్యమం ఆప్షన్‌ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను రెండు భాషల్లో ముద్రిస్తామని, ఒకవైపు తెలుగు, మరోపుటలో ఆంగ్ల మాధ్యమంలో పుటలు ఉండేలా చూస్తామన్నారు. ఇంకా మంత్రి ఏమన్నారంటే...

ఆచార్యుల నియామకాలపై సీఎస్‌ అధ్యయనం

వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీలపై కూడా త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుంది. నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు రెండు విధానాలను విద్యాశాఖ సూచించింది. గతంలో మాదిరిగా వర్సిటీల వారీగా చేసుకోవడం, మరొకటి ఉమ్మడిగా ఓ బోర్డు చేపట్టడం. ఏ విధానంలో చేయాలన్నది సీఎస్‌ అధ్యయనం చేసి నిర్ణయిస్తారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ ఉండగా...మళ్లీ చట్టం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. కమిటీ కూడా పలు సిఫారసులు చేసి న్యాయపరమైన సమస్యలు లేకుండా చట్టం చేయాలని సూచించింది. వాటినీ దృష్టిలో పెట్టుకుని చట్టం తీసుకురాబోతున్నాం.

తొలి విడతలో 9,123 బడుల అభివృద్ధి

మన ఊరు- మన బడి పథకం కింద తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం(9,123) పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. అందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తాం. మొత్తం 26,065 బడుల్లో 19.84 లక్షల మంది చదువుతుండగా 9,123 బడుల్లో 65 శాతం విద్యార్థులున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం తప్ప మిగిలిన పనులన్నీ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపే పూర్తవుతాయి.  బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందుకు, మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు. ప్రతిపక్షాలు అవగాహన రాహిత్యంతో ఉపాధ్యాయులు లేరని విమర్శలు చేయడం సరికాదు. పూర్తిగా తెలుసుకొని సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధం.


ఇప్పటికే 2 మాధ్యమాల్లో బోధన

కొద్ది నెలల క్రితమే అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీతో కలిసి ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు 9 వారాలపాటు శిక్షణ ఇచ్చాం.  1350 మంది శిక్షణ పొందారు. ఈసారి పెద్ద సంఖ్యలో శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో మొత్తం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే వారిలో అనేక మంది ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఒకేసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంపై సమస్యలేమీ ఉండవు. ఎందుకంటే ఇప్పటికే వేలాది బడుల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగుతోంది. గతంలో ఆంగ్ల మాధ్యమంలో చేరిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఆంగ్ల భాషలో మెరుగయ్యారా? లేదా? అని తెలుసుకునేందుకు అధ్యయనం చేయిస్తాం.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని