AP News: ఏపీలో ఇక 26 జిల్లాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విడుదల చేయడం ప్రారంభించింది.
ఆన్లైన్లో మంత్రివర్గం ఆమోదం
బాలాజీ, అల్లూరి, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయి పేర్లతోనూ జిల్లాలు
నోటిఫికేషన్ల విడుదల ఆరంభం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.
కొన్నింటికి పాతపేర్లే
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా... ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి శ్రీ బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టారు.
* విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేశారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ, విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఆయన పేరు పెట్టారు.
* అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాలవ్యావహారిక నామాలతో ఏర్పాటు చేశారు.
* ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.
* చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ బాలాజీ జిల్లాలోకి తెచ్చారు.
* మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటైనఎన్టీఆర్ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.
* హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురం పక్కనే ఉంటుంది. జిల్లాల పునర్విభజనలో దాన్ని అనంతపురం జిల్లా పరిధిలోకి తెచ్చారు.
* కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేశారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరింది. ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు.
* జనాభా పరంగా (2011 జనాభా లెక్కలు) 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.54 లక్షల అతి తక్కువ జనాభా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్‌షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్‌ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!