Assembly Elections 2022: ఇద్దరు సీఎంలు, ఐదుగురు మాజీ సీఎంల ఓటమి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలామంది ప్రముఖులకు నిస్తేజం మిగిల్చాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఉత్తరాఖండ్‌లో భాజపా గెలిచినప్పటికీ

Updated : 11 Mar 2022 09:14 IST

దిల్లీ, చండీగఢ్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలామంది ప్రముఖులకు నిస్తేజం మిగిల్చాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఉత్తరాఖండ్‌లో భాజపా గెలిచినప్పటికీ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ ఓటమి పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లో మాజీ సీఎం హరీశ్‌ రావత్‌, గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన మాజీ సీఎం చర్చిల్‌ అలెమావోలకు భంగపాటు తప్పలేదు. ఇక పంజాబ్‌లో ఆప్‌ జోరులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, అమరీందర్‌ సింగ్‌, రాజిందర్‌ కౌర్‌ భట్టల్‌లు కొట్టుకుపోయారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, శిరోమణి అకాలీదశ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌లను కూడా ఆప్‌ ఊడ్చేసింది. ప్రముఖ నటుడు, వితరణశీలి సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌కు అదృష్టం కలిసిరాలేదు. కాంగ్రెస్‌ తరఫున పంజాబ్‌లోని మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె పరాజితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని