యాదవ జాతి సంఘటిత శక్తిని చాటండి: మంత్రి తలసాని

యాదవులపై ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకోబోమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు....

Published : 23 May 2022 04:16 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: యాదవులపై ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకోబోమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో‘యాదవుల ప్లీనరీ సమావేశం-2022’ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే కోకాపేటలోని ఆత్మగౌరవ భవనం పూర్తవుతుందన్నారు. జిల్లాల్లో, గ్రామాల్లో కృష్ణాష్టమి, సదర్‌ ఉత్సవాలను ఘనంగా చేయాలని, యాదవ జాతి సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. సభలో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, జైపాల్‌యాదవ్‌, పార్థసారథి(ఏపీలోని పెనుమలూరు),సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్‌, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ డా.వర్రె వెంకటేశ్వర్లు యాదవ్‌, తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందార్ల అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, తమిళనాడు సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఆర్‌.దామోదరన్‌యాదవ్‌, టీజీవో హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎం.బి.కృష్ణాయాదవ్‌, అఖిల భారతీయ యాదవ సంఘం అధ్యక్షుడు నందకిశోర్‌ యాదవ్‌, సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని