నేటి నుంచి ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను శనివారం ఉదయం 7.30 గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్‌ మహోన్నతుడు’ అనే లఘుచిత్ర ప్రదర్శనతో ప్రారంభిస్తామని

Published : 28 May 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను శనివారం ఉదయం 7.30 గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్‌ మహోన్నతుడు’ అనే లఘుచిత్ర ప్రదర్శనతో ప్రారంభిస్తామని ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు కె.రాఘవేంద్రరావు, దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొక ప్రాంతంలో శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. తొలుత జూన్‌ 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు మేడసాని మోహన్‌ అవధానంతో తిరుపతిలో నెలవారీ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలుంటాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రసిద్ధులకు ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ గౌరవ పురస్కారాలు అందజేస్తారు. విజయవాడ, హైదరాబాద్‌లలో రెండు మెగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న నటీనటులు, రాజకీయ నాయకులను సన్మానిస్తారు. ఈ సమితి కన్వీనర్‌గా బాలకృష్ణ, సభ్యులుగా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు