రాష్ట్ర శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు

రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్‌ జియోసైన్స్‌ అవార్డ్డుకు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణ శ్రీనివాసశర్మ హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన

Published : 02 Jul 2022 06:34 IST

మౌలిక భూభౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గుర్తింపు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్‌ జియోసైన్స్‌ అవార్డ్డుకు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణ శ్రీనివాసశర్మ హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)లో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. మౌలిక భూభౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను ఆయనకు 2019 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర గనులమంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. దేశంలో బంగారు నిక్షేపాలపై ఆయన పలు పరిశోధనలు చేశారు. కర్ణాటకలోని హర్టిలో బంగారు నిక్షేపాలను గుర్తించేందుకు తొలిసారిగా శర్మ కొత్త సాంకేతికతను ఉపయోగించారు. అది భవిష్యత్‌ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనుంది. శ్రీనివాసశర్మ పరిశోధనల వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఒడిశాలోని సింగబంలో పరిశోధనల్లో ఆయన నిమగ్నమయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2003లో ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. కాగా ఎన్‌జీఆర్‌ఐకు చెందిన ఆనంద్‌ ప్రకాశ్‌సింగ్‌, ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌కు చెందిన డాక్టర్‌ వేమవరపు ఎంఎస్‌ఆర్‌ మూర్తి నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డులకు ఎంపికయ్యారు. పల్లెలోని యువత ఉన్నత చదువుల్లో భాగంగా జియోసైన్స్‌లో శాస్త్రవేత్తలుగా రాణించడానికి ముందుకురావాలని శ్రీనివాస శర్మ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని