Niranjan Reddy: రూ.400 కోట్లతో కొహెడలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌

నగర శివారులోని కొహెడలో రూ.400 కోట్ల పైచిలుకు వ్యయంతో  వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా నిర్మిస్తామని వెల్లడించారు. దీనిపై వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల

Updated : 02 Aug 2022 06:12 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారులోని కొహెడలో రూ.400 కోట్ల పైచిలుకు వ్యయంతో  వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా నిర్మిస్తామని వెల్లడించారు. దీనిపై వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మొత్తం 178 ఎకరాల విస్తీర్ణంలో.. 41.57 ఎకరాల్లో షెడ్లు, 39.70 ఎకరాల్లో 681 కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో శీతల గిడ్డంగులు, 45 ఎకరాల మేర రహదారులు, 24.44 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు నిర్మాణాలు చేపడతామని వివరించారు. మార్కెట్‌ మాస్టర్‌ లేఅవుట్‌, ఇంజినీరింగ్‌ డిజైన్లు, అంచనా వ్యయాల తయారీ బాధ్యతలను వయాంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(గుడ్‌గావ్‌)కు అప్పగించామన్నారు. విదేశాలతో పాటు దేశంలోని ప్రముఖ మార్కెట్లయిన ఆజాద్‌పూర్‌(దిల్లీ), వాశి(ముంబయి), రాజ్‌కోట్‌, వడోదరా(గుజరాత్‌)లను సందర్శించి లేఅవుట్ల నమూనాలను తయారుచేశారని, ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్‌ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని