పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో పీసీసీలు

విదేశాలకు వెళ్లేవారికి సంబంధించిన పాస్‌పోర్టు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌(పీసీసీ) జారీలో విదేశాంగశాఖ మరో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువులు, లాంగ్‌

Published : 27 Sep 2022 04:53 IST

రేపటి నుంచి అందుబాటులోకి సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేవారికి సంబంధించిన పాస్‌పోర్టు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌(పీసీసీ) జారీలో విదేశాంగశాఖ మరో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువులు, లాంగ్‌ టర్మ్‌ వీసా, ఇమిగ్రేషన్‌ తదితరాలకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆన్‌లైన్‌ పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రా(పీవోపీఎస్‌కే)ల్లోనూ పీసీసీలను అందించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. బుధవారం నుంచి రాష్ట్రంలోని పీవోపీఎస్‌కేల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని