పరీక్ష రాసేందుకు పీజీ మెడికల్‌ విద్యార్థులకు అనుమతి

పీజీ మెడికల్‌ తుది సంవత్సరం విద్యార్థులందరికీ ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు జాతీయ వైద్య మండలి పీజీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 02 Jun 2023 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ తుది సంవత్సరం విద్యార్థులందరికీ ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు జాతీయ వైద్య మండలి పీజీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, బయోమెడికల్‌ రీసెర్చ్‌ బేసిక్‌ కోర్సు (బీసీబీఆర్‌) ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్‌ విధుల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 2020-21 బ్యాచ్‌ మెడికల్‌ పీజీ విద్యార్థులు బీసీబీఆర్‌ ఆన్‌లైన్‌ కోర్సు పూర్తి చేయలేదు. ఈ మేరకు వారికి జూన్‌ 2023లో జరిగే పరీక్షలకు అనుమతించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు