TS Elections: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల నామినేషన్లకు ‘ముఖరా’ ఆసరా పింఛన్‌లు

భారాస అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పట్ల అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా.కె గ్రామ పింఛనుదారులు ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

Updated : 16 Oct 2023 07:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పట్ల అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా.కె గ్రామ పింఛనుదారులు ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇప్పటికే ఆదర్శ గ్రామం గా పేరొందిన ఈ పల్లెలోని ఆసరా పింఛనుదారుల నిర్ణయంతో మరోసారి ప్రత్యేకంగా నిలిచింది. ఈ గ్రామంలో వందమంది పింఛను పొందుతున్నారు. వారందరూ తలా రూ.వేయి చొప్పున రూ.లక్ష నగదును సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి చేతిలో పెట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు తమ పేరు మీద నామినేషన్‌ ఖర్చుల కోసం ఇచ్చి రావాలని సర్పంచిని కోరారు. దీంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ సహకారంతో ఆదివారం ప్రగతి భవన్‌కు చేరుకున్న మీనాక్షి.. సీఎం కేసీఆర్‌ను కలిసి రూ.50వేల చొప్పున రెండు చెక్కులను అందజేశారు. ముఖరా.కె గ్రామస్తులకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృతజ్జతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని