వైద్యవిద్యార్థుల స్టైఫండ్‌ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు

వైద్య విద్యార్థులకు మెడికల్‌ కాలేజీలు స్టైఫండ్‌ చెల్లించే విషయంలో మార్గదర్శకాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌లో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

Published : 23 Apr 2024 03:53 IST

ఈనాడు, దిల్లీ: వైద్య విద్యార్థులకు మెడికల్‌ కాలేజీలు స్టైఫండ్‌ చెల్లించే విషయంలో మార్గదర్శకాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌లో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. సోమవారం దీనిపై విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది. పీజీ వైద్య విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైఫండ్‌ను తరచూ పెంచుతున్నారని, అయితే అదే సమయంలో కాలేజీలు వసూలుచేసే ఫీజులతో దీన్ని ముడిపెట్టడంలేదని యాజమాన్యాల సంఘం పిటిషన్‌లో పేర్కొంది. ఒకవేళ ఫీజులు పెంచినా విద్యార్థులు కోర్టుల్లో సవాల్‌చేస్తుండటం తదితర పరిణామాలతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై తీవ్ర ఆర్థికభారం పడుతోందని పిటిషనర్ల తరుఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని