రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు

కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది.

Published : 01 May 2024 02:54 IST

తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక

ఈనాడు, హైదరాబాద్‌: కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది. మత విద్వేషాలు రెచ్చగొడుతూ దాడులకు పాల్పడే ధోరణి ఆందోళన కలిగిస్తోందని వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, కో కన్వీనర్లు ప్రొఫెసర్‌ జి.లక్ష్మణ్‌, ఎం రాఘవాచారి, కె.రవిచందర్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య, లౌకిక భావన పెంపొందించడానికి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు, రచయితలు, యువ కవులు సమూహ వేదిక ఏర్పాటు చేసుకుని సభలు నిర్వహిస్తున్నారు. కేయూ వీసీ అనుమతితో ఆయనే ముఖ్య అతిథిగా శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశంలో ఏబీవీపీ మూకలు చొరబడి కవులు, రచయితల్ని బూతులు తిడుతూ అడ్డుకున్నాయి. బయటకు వస్తుంటే భౌతిక దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని