North Korea: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం!

దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కిమ్‌ ప్రభుత్వం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది.

Published : 14 Jan 2024 16:35 IST

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించడం దీనికి కారణమైంది. ఈ పరిణామాల నడుమే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ప్రభుత్వం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది మొదటి మిసైల్‌ ప్రయోగం. దక్షిణ కొరియా (South Korea) సైన్యం దీన్ని ధ్రువీకరించింది. జపాన్‌ రక్షణశాఖ సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. చివరిసారి గతేడాది డిసెంబరు 18న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ICBM)ని ఉత్తర కొరియా (North Korea) పరీక్షించింది.

అబ్బే శతఘ్ని గుండ్లు కాదు..శబ్దాలు సృష్టించాం

కిమ్‌ బలగాలు ఇటీవల పశ్చిమ తీరంలో పెద్దఎత్తున పేలుళ్లు జరుపుతూ సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో కొరియా ద్వీపకల్పం వేడెక్కింది. దక్షిణ కొరియా సైతం దీటుగా సమాధానం చెప్పింది. వాషింగ్టన్‌, సియోల్‌లు కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సైన్యానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్‌లో దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికలు, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉ.కొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని