బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం.. స్విట్జర్లాండ్‌లో చిక్కుకుపోయిన బ్లింకెన్

బోయింగ్‌ విమానాలు వాడుతున్న ప్రముఖులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌(Antony Blinken) ప్రయాణించాల్సిన విమానంలో వైఫల్యం తలెత్తింది. 

Updated : 18 Jan 2024 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దావోస్ సదస్సుకు వెళ్లిన అమెరికా(USA) విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌(Antony Blinken) స్విట్జర్లాండ్‌లో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్(Boeing 737) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆక్సిజన్‌ లీకేజీ చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వాయుసేన మరో విమానం పంపడంతో ఆయన దావోస్‌ నుంచి తిరుగుపయనమయ్యారని అధికారులు మీడియాకు తెలిపారు.

బోయింగ్‌ మ్యాక్స్‌ విమానాలకేమైంది?

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల నిమిత్తం బ్లింకెన్ సోమవారం దావోస్ వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం వాషింగ్టన్‌కు తిరిగిరావాలి. ఈ సమయంలోనే విమానంలో సమస్య తలెత్తింది. ఇటీవల కాలంలో బోయింగ్‌ సంస్థకు  చెందిన విమానాల్లో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గగనతలంలో ఉన్న విమానం డోర్ ప్లగ్‌ ఊడిపోయింది. ఆ డోర్‌కు దగ్గర్లోనే ప్రయాణికుల సీట్లు ఉండటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. తర్వాత ఆ విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టి తనిఖీలు చేస్తున్నాయి. కానీ ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. గతవారం జపాన్‌లో ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 737-800 కాక్‌పిట్‌ అద్దంపై పగుళ్లను గుర్తించిన పైలట్లు.. అత్యవసర ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని