North Korea: రష్యా, చైనా నేతల సమక్షంలో.. ఆయుధాలు ప్రదర్శించిన కిమ్‌

రష్యా, చైనా నేతల సమక్షంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్(Kim Jong Un) తన దేశ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. విక్టరీ డేని పురస్కరించుకొని కిమ్ ఆ ప్రదర్శన చేపట్టారు. 

Updated : 28 Jul 2023 11:17 IST

ప్యాంగ్యాంగ్‌: కొరియా యుద్ధం(Korean War) ముగిసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఉత్తరకొరియా ‘విక్టరీ డే’గా నిర్వహించింది. ఈ మేరకు రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో గురువారం రాత్రి కిమ్(Kim Jong Un) ప్రభుత్వం ఆయుధాలను ప్రదర్శించింది. వాటిలో అణు సామర్థ్యం కలిగిన క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. భారీస్థాయిలో నిర్వహించిన ఈ విక్టరీ డే వేడుకలకు చైనా(China), రష్యా(Russia) రక్షణశాఖ ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం.

రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు, చైనా రక్షణ శాఖ ప్రతినిధులు వచ్చారు. కొవిడ్-19 తర్వాత ఆ స్థాయి వ్యక్తులు ఉత్తర కొరియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. కిమ్ వారికి తన దేశ ఆయుధ సామర్థ్యాన్ని చూపించారు. రష్యా, చైనా నేతలు సమక్షంలో కిమ్ ప్రదర్శించిన ఈ క్షిపణులపై ఐరాస భద్రతా మండలి గతంలో నిషేధం విధించింది. అప్పుడు ఆ నిషేధాన్ని ఆ రెండు దేశాలు సమర్థించాయి. అలాగే ఉత్తర కొరియా(North Korea) అభివృద్ధి చేస్తోన్న అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ మిస్సైల్స్ విషయంలో కూడా ఆ రెండు దేశాలు దూరం పాటిస్తూ ఉన్నాయి.  కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

అమెరికాలో బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం

ఈ ప్రదర్శనలో ఇటీవల కాలంలో ఉత్తర కొరియా(North Korea) అభివృద్ధి చేసిన హాసాంగ్‌-17, హాసాంగ్‌-18 ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయి. అవి అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా చేధించగలవని గతంలో స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రదర్శనతో మానవ రహిత డ్రోన్లను కూడా ఈ దేశం అభివృద్ధి చేస్తున్న విషయం వెల్లడైంది. డ్రోన్‌ డిజైన్లను కూడా రష్యా, చైనా ప్రతినిధులకు చూపించింది. వీటిల్లో కొన్ని డ్రోన్లను గత నెల ఓ ఎయిర్‌బేస్‌ నుంచి ఉత్తర కొరియా పరీక్షించింది. ఇవి అమెరికా డ్రోన్లు రీపర్‌, గ్లోబల్‌ హాక్‌కు నకళ్లవలే ఉన్నట్లు ఎన్‌కే న్యూస్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని