Spy: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం వేళ.. మొస్సాద్‌ ఏజెంట్‌ను ఉరితీసిన ఇరాన్‌!

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం కొనసాగుతోన్న వేళ.. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ‘మొస్సాద్‌’తో సంబంధం ఉన్న ఓ గూఢచారిని ఉరితీసినట్లు ఇరాన్‌ ప్రకటించింది.

Published : 16 Dec 2023 21:45 IST

టెహ్రాన్‌: హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేపడుతోన్న దాడులను ఇరాన్‌ (Iran) తీవ్రంగా ఖండిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘మొస్సాద్‌’కు పనిచేస్తున్న ఓ ఏజెంట్‌ను ఉరితీసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసిన ఓ వ్యవహారంలో అతడి ప్రమేయం ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయని తెలిపింది. అతడు మొస్సాద్‌ సహా విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలతో పని చేస్తున్నాడని ఆరోపించింది.

ఈ క్రమంలోనే జాహెదాన్‌లోని జైలులో అతడికి మరణశిక్ష అమలు చేసినట్లు ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ‘ఐఆర్‌ఎన్‌ఏ’ తెలిపింది. అయితే.. ఆ ఏజెంట్‌ వివరాలు వెల్లడించలేదు. గతేడాది ఏప్రిల్‌లో ఇరాన్‌ నిఘా విభాగం అధికారులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారు మొస్సాద్‌తో సంబంధం ఉన్న బృందంలో భాగమని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఉరిశిక్ష అమలైన వ్యక్తి వారిలో ఒకరా? అనేది తెలియరాలేదు.

హైజాక్‌ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ను ఇజ్రాయెల్ తన అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకునేందుకు సైనిక చర్యకూ వెనుకాడబోమని గతంలో హెచ్చరించింది. అటు ఇరాన్‌కూ ఇజ్రాయెల్‌ అంటే ఏ మాత్రం గిట్టదు. గాజాలో ఐడీఎఫ్‌ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తులను నిర్బంధించినట్లు ఇరాన్ అప్పుడప్పుడు ప్రకటిస్తుంది. 2020లో ఇరాక్‌లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఓ ఇరాన్‌ జనరల్ గురించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు సమాచారాన్ని లీక్ చేసినందుకుగానూ ఓ వ్యక్తిని ఉరితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని