Hezbollah: ఇజ్రాయెల్‌ దాడిలో హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ హతం

లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి.

Published : 08 Jan 2024 22:34 IST

జెరూసలెం: లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా (Hezbollah) సీనియర్‌ కమాండర్‌ విస్సమ్‌ అల్‌- తవిల్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి. మజ్‌దల్‌ సలెం గ్రామంలో విస్సమ్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఇజ్రాయెల్‌ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అతడితోపాటు మరో ఉగ్రవాది మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. దీనిపై హెజ్‌బొల్లా సైతం ప్రకటన విడుదల చేసింది. తొలిసారిగా కీలక వ్యక్తిని కోల్పోయినట్లు పేర్కొంది. దక్షిణ గాజా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కార్యకలాపాలను పర్యవేక్షించేవారిలో హసన్‌ తవిల్‌ కీలక వ్యక్తిగా తెలుస్తోంది. అంతేకాకుండా అతడు ఆ సంస్థలో పలు కీలక బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం.

అక్టోబర్‌ 7న హమాస్‌ విధ్వంసం సృష్టించిన తర్వాత.. ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున ప్రతిదాడులకు దిగుతోంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాదులు సైతం హతమవుతున్నారు. సరిహద్దు దేశమైన లెబనాన్‌పై జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 130కి పైగా హెజ్‌బొల్లా ఉగ్రవాదులు మరణించారు. గత వారం బీరుట్‌లో హమాస్‌ డిప్యూటీ లీడర్‌ హతమవ్వడంతో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని