Israel: ఇజ్రాయెల్‌ దాడిలో లెబనీస్‌ మేయర్‌ మృతి

ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం సోమవారం జరిపిన దాడిలో లెబనాన్‌ (Lebanon)లోని టెబే గ్రామానికి చెందిన మేయర్‌ హుస్సేన్‌ మాన్సూర్‌ మృతి చెందారు. ఇజ్రాయెల్‌ ప్రయోగించిన బాంబుషెల్‌ ఆయనపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

Published : 12 Dec 2023 02:30 IST

బీరూట్‌: ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం సోమవారం జరిపిన దాడిలో లెబనాన్‌ (Lebanon)లోని టెబే గ్రామానికి చెందిన మేయర్‌ హుస్సేన్‌ మాన్సూర్‌ మృతి చెందారు. ఇజ్రాయెల్‌ ప్రయోగించిన బాంబు ఆయనపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ బాంబు పేలకపోవడం గమనార్హం. పేలి ఉంటే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేది. హుస్సేన్‌ మృతిని బంధువులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ సైన్యం, లెబనాన్‌ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం గత రెండు నెలలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై దాడులు చేస్తుండగా.. ఆ మిలిటెంట్లకు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగుతోంది. ఆదివారం కూడా డ్రోన్ల సాయంతో దాడులకు పాల్పడింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌.. దక్షిణ లెబనాన్‌లోని పలు గ్రామాలు, పట్టణాలపై సోమవారం ఎయిర్‌స్ట్రైక్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే హుస్సేన్‌ మృతి చెందారు. 

హెజ్‌బొల్లా దాడులపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రతినిధి ఎలాన్‌ లేవీ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం చేసే ఆసక్తి తమకు లేదని స్పష్టం చేశారు. అయితే, హెజ్‌బొల్లా గ్రూప్‌ ఇలాగే కవ్విస్తూ యుద్ధానికి కాలు దువ్వితే.. ఈ ఉగ్రవాదులతోపాటు లెబనాన్‌ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని