North Korea: ఆ అమెరికా సైనికుడిని వెనక్కు పంపనున్న ఉత్తర కొరియా..!

తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడిని ఉత్తరకొరియా(North Korea) బహిష్కరించనుంది. ఈ మేరకు కిమ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. 

Published : 27 Sep 2023 18:02 IST

ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు(US soldier) ట్రావిస్‌ టి.కింగ్‌ పై ఉత్తరకొరియా( North Korea) చేసిన ఆసక్తికర ప్రకటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సైనికుడిని తమ దేశం నుంచి బహిష్కరించాలని కిమ్(Kim) ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సైనికుడిని పూర్తిస్థాయిలో విచారించారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. అయితే అతడిని ఎప్పుడు, ఎక్కడికి బహిష్కరిస్తారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. 

ట్రూడో సార్‌ గుర్తుందా.. ‘మీరు ఇది చదవాలనుకోరు’..!

జులై 18వ తేదీన కొందరు సందర్శకుల బృందంతో కలిసి 23 ఏళ్ల ట్రావిస్‌ సంయుక్త గస్తీ ప్రాంతానికి చేరుకొన్నాడు. అక్కడి నుంచి అతడు ఉత్తరకొరియాలోకి ప్రవేశించాడు. అతడిని ఉత్తర కొరియా నుంచి విడిపించేందుకు ఐరాస కమాండ్‌ సాయంతో అమెరికా యత్నాలు చేస్తోంది. ఇంతలో ఉత్తర కొరియా ఆసక్తికర ప్రకటన చేసింది. అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే తాను సరిహద్దులు దాటి ఉత్తరకొరియాలోకి ప్రవేశించినట్లు కింగ్‌ చెప్పాడని పేర్కొంది. ట్రావిస్‌ ఉద్దేశపూర్వకంగానే ఉత్తరకొరియాలో నివసించేందుకు సరిహద్దులు దాటినట్లు ప్యాంగ్‌యాంగ్‌ దర్యాప్తు బృందాలు కూడా నిర్దారించాయి. ఇప్పుడు అతడిని బహిష్కరించే పనిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని