UK: భారత్‌లో సామాజిక ఆర్థిక విప్లవానికి మోదీనే కారణం: విదేశాంగ మంత్రి జైశంకర్‌

గత దశాబ్ద కాలంలో భారత్‌ సాధించిన సామాజిక ఆర్థిక విప్లవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. యూకేలో పర్యటిస్తున్న ఆయన.. లండన్‌లోని భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని మాట్లాడారు.

Published : 14 Nov 2023 05:17 IST

లండన్‌: గత దశాబ్ద కాలంలో భారత్‌ సాధించిన సామాజిక ఆర్థిక విప్లవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వమే కారణమని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S jaishankar) అన్నారు. యూకేలో పర్యటిస్తున్న ఆయన.. లండన్‌లోని భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని భారత్‌లో వచ్చిన మార్పు, ప్రధాని మోదీ తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాల గురించి వివరించారు.

‘‘ప్రపంచమంతా మారిపోయింది. భారత్‌ కూడా మార్పు చెందింది. ఆ మార్పు ఎలా వచ్చిందన్న ప్రశ్నకి సమాధానం ప్రధాని మోదీ. ఆయన ప్రారంభించిన బేటీ పడావో.. బేటీ బచావో, జన్‌ధన్‌ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి అనేక కార్యక్రమాలు ప్రజలపై ఎంతో ప్రభావం చూపాయి. వచ్చే ఏడాదికి మా ప్రభుత్వం పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ దశాబ్ద కాలంలో మోదీ చొరవ వల్ల భారత్‌ సామాజిక ఆర్థిక విప్లవాన్ని సాధించింది’’అని జైశంకర్‌ అన్నారు. కాలక్రమంలో భారత్‌, యూకేలో అనేక మార్పులు వచ్చాయని.. వాటికి అనుగుణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను పునర్మించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని