Sydney: షాపింగ్ మాల్ ఘటన మరువకముందే.. మరోసారి కత్తి దాడి కలకలం

సిడ్నీ (Sydney)లో రెండు రోజుల వ్యవధిలో ఒకేతరహా ఘటన జరిగింది. షాపింగ్ మాల్‌ దాడి నుంచి తేరుకోకముందే చర్చిలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. 

Published : 15 Apr 2024 18:46 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sydney) నగరంలో మరోసారి కత్తిదాడి (Stabbing Incident) జరిగింది. వాక్లేలోని చర్చిలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల వ్యవధిలో ఒకేతరహా ఘటన జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చర్చి ప్రీస్ట్‌, ప్రార్థనలకు వచ్చినవారు ఈ దాడికి గురయ్యారు. అయితే వారికి ప్రాణాపాయమేదీ లేదని, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ ఘటనలో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

సిడ్నీ మాల్‌ కత్తి దాడి.. నిందితుడికి మానసిక సమస్యలు

శనివారం వెస్ట్‌ఫీల్డ్‌లోని షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు అక్కడున్న వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది నెలల చిన్నారితోపాటు 8 మంది గాయపడ్డారు. మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారు. మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. అయితే అందులో ఉగ్రకోణం లేదని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని