Israel: వైద్యసిబ్బంది, పౌరుల వేషధారణలో ఆస్పత్రిలోకి చొరబడి.. మిలిటెంట్లను హతమార్చి

‘అక్టోబర్‌ 7’ తరహా దాడులను మరోసారి చేపట్టేందుకు కుట్ర పన్నుతున్న ముగ్గురిని ఇజ్రాయెల్‌ దళాలు హతమార్చాయి. ఇందుకోసం ఓ ఆసుపత్రిలోకి మారు వేషాల్లో ప్రవేశించాయి.    

Updated : 30 Jan 2024 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో దాక్కొన్న ముగ్గురు హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ (Israel) బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి మట్టుబెట్టాయి. స్థానిక ‘ఇబ్న్‌ సినా’ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకొంది. మరణించిన ముగ్గురు వ్యక్తులు తమ జెనిన్‌ బ్రిగేడ్‌ సభ్యులని హమాస్‌ ప్రకటించింది. 

వీరు ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకొన్న ఇజ్రాయెల్‌.. ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. వీరు వేర్వేరుగా.. సాధారణ వైద్య సిబ్బంది, పౌరుల వేషధారణలో అక్కడికి చేరుకొన్నారు. వీరిలో కొందరు హిజాబ్‌లు ధరించారు. ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్‌లో మిలిటెంట్లు ఉన్నట్లు నిర్ధరించుకొని, అక్కడికి చేరుకొని ముగ్గురినీ మట్టుబెట్టారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఆపరేషన్‌ మొత్తం పూర్తైనట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది.

పాకిస్థానీ నావికుల్ని కాపాడిన భారత్‌

మృతుల్లోని హమాస్‌ మిలిటెంట్‌ మహమ్మద్‌ జలమ్నెహ్‌ ఇటీవల కొంతకాలంగా ఈ ఆసుపత్రిని వేదికగా చేసుకొని ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. అతడి ఇద్దరు సోదరులు కూడా ఈ ఆపరేషన్‌లో మరణించినట్లు పేర్కొంది. వీరు కూడా పలు దాడుల్లో నిందితులని తెలిపింది. వీరు ముగ్గురూ కలిసి అక్టోబర్‌ 7 తరహా దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని