Russia: పుతిన్‌తో యూఏఈ అధ్యక్షుడు అల్‌-నహ్యాన్‌ భేటీ

రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌తో (Putin) యూఏఈ (UAE) అధ్యక్షుడు అల్‌-నహ్యాన్‌ (Al-Nahyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను పుతిన్‌ కొనియాడారు.

Published : 16 Jun 2023 20:45 IST

మాస్కో: రష్యాలోని (Russia) సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో (Saint Petersburg) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌-నహ్యాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూఏఈతో రష్యా సంబంధాలను పుతిన్‌ కొనియాడారు. ‘రష్యాకు ఎమిరేట్‌ కీలక భాగస్వామి’ అని ఈ సందర్భంగా పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పుతిన్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో బందీలను మార్చుకునేందుకు యూఏఈ చూపిన చొరవను పుతిన్‌ అభినందించారు. రష్యా-యూఎస్‌ఏల మధ్య బందీల మార్పిడి అంశంలోనూ యూఏకీ కీలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అల్-నహ్యాన్‌ అనుకూలంగా ఉన్నట్లు యూఏఈ అధికార వార్తా సంస్థ డబ్ల్యూఏఎం వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపింది. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(OPEC) కూటమిలో ఈ రెండు దేశాలు సున్నితంగా ఉంటున్నాయి. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోకు నేరుగా విమానాలు నడిపిన ఏకైక దేశం యూఏఈ. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని