Balakrishna: తెలుగు జాతికి మార్గదర్శి.. ఎన్టీఆర్!: బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ నటుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన తనయుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ (Balakrishna) తెల్లవారుజామున పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతిని రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. రాజకీయాల్లో అనేక సంక్షేమ పధకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Updated : 28 May 2023 16:14 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు