FlashBack - Bhuvi: ఇంగ్లండ్‌పై అలా మెరిసిన ‘స్వింగ్ కింగ్’.. మళ్లీ తిరిగొస్తాడా?

భువీ (Bhuvneshwar Kumar).. క్రికెట్‌ అభిమానులకు ఆ పేరు వినగానే తొలుత గుర్తొచ్చేది అతని స్వింగ్‌ బౌలింగే! అంతర్జాతీయ క్రికెట్‌లో అతని అడుగే ఓ సంచలనం! 2012లో పాక్‌తో సిరీస్‌లో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ ‘కింగ్ ఆఫ్ స్వింగ్’.. అరంగేట్ర మ్యాచ్‌ల్లో మొదటి బంతికే వికెట్ తీసిన ఏకైక బౌలర్‌. ఇలాగే, ఇంగ్లండ్‌ పర్యటనలోనూ భువీ అద్భుతం సృష్టించాడు. లార్డ్స్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌ (2014)లో 82 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా ఐకానిక్‌ విజయాన్ని సాధించింది. మొత్తంగా 21 టెస్టుల్లో 63, 121 వన్డేల్లో 141, 87 టీ20 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టిన భువీ కెరీర్‌లో ప్రస్తుతం కొంత గడ్డు కాలమే కొనసాగుతోంది. దీన్ని అధిగమించి భువీ బౌన్స్‌ బ్యాక్‌ కావాలని క్రికెట్‌ ప్రపంచం కోరుకుంటోంది!

Updated : 13 Jun 2023 18:47 IST

Tags :

మరిన్ని