Bimbisara: ఆ నేపథ్యంలో చేసిన ఓ ప్రయత్నమే ‘బింబిసార’: కల్యాణ్‌ రామ్‌

‘బింబిసార’.. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ- యాక్షన్‌ చిత్రమిది. సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా ఈవెంట్‌ నిర్వహించింది. కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘మనందరికీ చందమామ కథలు, జానపద సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి చిత్రాలకు తాత (ఎన్టీఆర్) నాంది పలికారు. ఆయన నటించిన ‘పాతాళభైరవి’, బాబాయ్‌ (బాలకృష్ణ) నటించిన ‘భైరవద్వీపం’, చిరంజీవి గారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇలా ఎన్నో సినిమాలు మన ముందుకొచ్చాయి. ఆ నేపథ్యంలో మేం చేసిన ఓ ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సినిమాని మా తాతగారికి అంకితం చేస్తున్నా’’ అన్నారు.

Published : 30 Jul 2022 20:22 IST

Tags :

మరిన్ని