Ram Pothineni: ఇంకా ఏంటి లిమిట్స్‌.. మాస్‌ డైలాగ్‌తో అదరగొట్టిన రామ్‌

‘నీ స్టేట్‌ దాటలేనన్నావు దాటా.. నీ గేటు దాట లేనన్నావు దాటా.. నీ పవర్‌ దాటలేనన్నావు దాటా.. ఇంకేంటి దాటేది..’ అంటున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సోమవారం హీరో రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ‘BoyapatiRAPO First Thunder’ అంటూ చిన్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. బోయపాటి శైలిలో రామ్‌ మాస్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాకు థమన్‌ సంగీత దర్శకుడు. శ్రీలీల కథానాయిక.

Published : 15 May 2023 11:57 IST

Tags :

మరిన్ని