Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. భక్తుల రద్దీ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి నుంచి 10 రోజులపాటు రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. విజయవాడ నవరాత్రుల్లో 14 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. వరద ఉద్ధృతి దృష్ట్యా.. కృష్ణా నదిలో స్నానాలు నిషేధించినట్లు తెలిపారు. ఘాట్ల వద్ద 800 జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

Published : 26 Sep 2022 13:16 IST

Tags :

మరిన్ని